స్వీట్‌ కార్న్‌ వెజ్‌ సూప్‌

కావల్సిన పదార్ధాలు
పేస్టు కోసం:
స్వీట్‌కార్న్‌ గింజలు – అరకప్పు
నీళ్లు – రెండు టేబుల్‌ స్పూన్లు
సూప్‌:
ఆయిల్‌ – మూడు టీస్పూన్లు
వెల్లుల్లి రెబ్బలు – రెండు
అల్లం – అంగుళం ముక్క
స్ప్రింగ్‌ ఆనియన్‌ తరుగు – నాలుగు టేబుల్‌ స్పూన్లు
స్వీట్‌ కార్న్‌ గింజలు – పావు కప్పు
క్యారెట్‌ తరుగు – పావు కప్పు
బీన్స్‌ తరుగు – పావు కప్పు
నీళ్లు – మూడు కప్పులు
ఉప్పు – రుచికి సరిపడా
మిరియాలపొడి – టీ స్పూను
వెనిగర్‌ – టీస్పూను
కార్న్‌ఫ్లోర్‌ – టీస్పూను (పావు కప్పు నీటిలో కలిపి పెట్టుకోవాలి) 

తయారీ విధానం
►ముందుగా అల్లం, వెల్లుల్లిలను సన్నగా తరగాలి. 
►బాణలి వేడెక్కిన తరువాత ఆయిల్‌ వేసి వెల్లుల్లి, అల్లం తరుగు వేసి దోరగా వేయించాలి. 
►తరువాత స్ప్రింగ్‌ ఆనియన్‌ తరుగు, పావు కప్పు స్వీట్‌ కార్న్, క్యారెట్, బీన్స్‌ తరుగును వేసి ఐదునిమిషాలు ఉడకనివ్వాలి. 
►ఇప్పుడు పేస్టుకోసం తీసుకున్న స్వీట్‌కార్న్‌ను రెండు టేబుల్‌ స్పూన్లు నీళ్లు వేసి మెత్తగా గ్రైండ్‌ చేసుకోవాలి. 
►ఈ పేస్టును ఉడుకుతున్న సూప్‌ మిశ్రమంలో వేసి రెండు నిమిషాలు వేయించాలి. 
►ఇప్పుడు మూడు కప్పుల నీళ్లు, రుచికి సరిపడా ఉప్పు వేసి 15 నిమిషాలు మరిగించాలి. 
►మరిగాక కార్న్‌ఫ్లోర్‌ మిశ్రమం వేసి కలుపుకోవాలి. 
►సూప్‌ మిశ్రమం చిక్కబడిన తరువాత మిరియాల పొడి, వెనిగర్, స్ప్రింగ్‌ ఆనియన్‌ వేసి సర్వ్‌ చేసుకోవాలి. 

Advertisements
Advertisements