బీట్‌రూట్‌ చికెన్‌ సూప్‌

కావల్సిన పదార్ధాలు
చికెన్‌ – పావుకేజీ
వెల్లుల్లి రెబ్బలు – ఆరు
అల్లం – అరంగుళం ముక్క
ఉల్లిపాయలు – రెండు
బీట్‌రూట్‌ – రెండు
మిరియాల పొడి – టీ స్పూను
బటర్‌ – రెండు టేబుల్‌ స్పూన్లు
ఉప్పు – రుచికి సరిపడా
కొత్తిమీర తరుగు – నాలుగు టేబుల్‌ స్పూన్లు
స్ప్రింగ్‌ ఆనియన్‌ తరుగు – మూడు టేబుల్‌ స్పూన్లు

తయారీ విధానం
►పాత్రను తీసుకుని.. శుభ్రంగా కడిగిన చికెన్, ఒక ఉల్లిపాయను ముక్కలు తరిగి వేయాలి. మూడు వెల్లుల్లి రెబ్బలు, మిరియాల పొడి, రుచికి సరిపడా ఉప్పు, లీటరు నీళ్లు పోసి కలపాలి. ఈ మిశ్రమాన్ని మూతపెట్టి 10 నిమిషాలు ఉడికించాలి. 
►ఉడికించిన మిశ్రమం నుంచి చికెన్, స్టాక్‌ను వేరుచేసి పక్కనబెట్టుకోవాలి. చికెన్‌ను చిన్న చిన్న ముక్కలు చేసుకోవాలి. 
►స్టవ్‌ మీద పాన్‌ వేడెక్కిన తరువాత బటర్‌ వేయాలి. 
►మిగిలిన వెల్లుల్లిని కచ్చాపచ్చాగా దంచి వేయాలి. మిగిలిన ఉల్లిపాయను ముక్కలు తరిగి వేసి వేయించాలి. 
►ఇవి రెండూ వేగిన తరువాత చికెన్‌ స్టాక్, బీట్‌రూట్‌ ముక్కలు మరికొన్ని నీళ్లు పోసి మరిగించాలి. 
►పది నిమిషాలు మరిగాక చికెన్‌ ముక్కలు వేసి మరో ఇరవై నిమిషాలు మరిగించి కొత్తిమీర, స్ప్రింగ్‌ ఆనియన్‌ తరుగుతో గార్నిష్‌ చేసి వేడివేడిగా సర్వ్‌చేయాలి. 

Advertisements
Advertisements